మరికాసేపట్లో.. ‘గ్రామ సచివాలయం’ ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్న సీఎం జగన్!

  • క్యాంపు కార్యాలయంలో విడుదల చేయనున్న జగన్
  • హాజరుకానున్న మంత్రులు, ఉన్నతాధికారులు
  • ఈ నెల 1-8 తేదీల మధ్య జరిగిన పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 1 నుంచి 8 వరకూ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్, మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో 1.26 లక్షలకుపైగా గ్రామ సచివాలయం ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Andhra Pradesh
Grama sachivalayam
Results
Jagan
Chief Minister

More Telugu News